ముస్తాబాద్ డిసెంబర్19, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని బకెట్ గుర్తుకు ఓటువేయాలని మండలంలోని అన్నిగ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నెవారిపల్లె, బదనకల్ ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని తెరాస ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నిస్వార్ధపరుడు సౌమ్యుడు అయిన సందుపట్ల అంజిరెడ్డిని బకెట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతులను, ఓటర్లను కోరారు. అనంతరం రైతుబంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక ప్రభుత్వం బారాస ప్రభుత్వమని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు రైతులు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు. ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ,సర్పంచులు ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
