*నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే*
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు తెగిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల రూరల్ మండలం లోని గ్రామం మీదుగా వెళుతున్న నేషనల్ హైవే రోడ్డు వర్షానికి చాలావరకు దెబ్బ తిన్నది. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వెళ్లి రోడ్డును పరిశీలించి తొందరలోనే రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపడుతామని అన్నారు. వారి వెంట మండల అధ్యక్షులు బాల ముకుందం గారు, ఉప సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె శ్రీనివాస్ గారు, మండల యువజన కార్యదర్శి శ్రీ పాల్,మైనారిటీ మండల అధ్యక్షులు జహంగీర్, మరియు వాసాల మల్లేష్, తిరుమల కార్యకర్తలు ప్రజలు వెంట ఉన్నారు.
