ప్రాంతీయం

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తాo

20 Views

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి హామీ హర్షం ప్రకటించిన లింగాల రవికుమార్

ఖమ్మం జిల్లా,మర్చి 1 తెలుగు న్యూస్ 24/7

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల సమీపంలో భూధాన్ బోర్డు భూముల్లో నిరాశ్రయులైన అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ప్రకటించడం పట్ల బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు దళిత బహుజన సామాజిక ఉద్యమ నేత లింగాల రవికుమార్,హర్షం ప్రకటించారు.మంత్రి పొంగులేటి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని, మంత్రి ఆధ్వర్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నారని లింగాల రవికుమార్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం భూదాన్ బోర్డు భూములలో దళారుల చేతిలో మోసపోయి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు పోలీస్ అధికారుల సహకారంతో డబ్బులు ఇప్పించేందుకు కృషి చేయాలని రవికుమార్ విజ్ఞప్తి చేశారు పునరావాస కేంద్రాలలో ఇబ్బంది పడుతున్న భూధాన్ బాధితులకు అత్యంత వేగవంతంగా ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు లింగాల రవికుమార్ విజ్ఞప్తి చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *