ప్రాంతీయం

త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు…

133 Views

ముస్తాబాద్, ప్రతినిధి. ఆగస్టు15, మండలంలోని మహనీయులకు, ప్రభుత్వ కార్యాలయాలయాల్లొ పలు సంఘాల నేతలు గ్రామాలలోని విద్యాలయాల్లో మూడు రంగుల జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ జాతీయ పండుగ అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగిఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి జాతీయపతాకంలోని పైపట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే.. మధ్యలోని తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయతీని చాటుతుంది. కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని, పాడిపంటల్ని, సంపదని సూచిస్తుంది. మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కోఆప్షన్ షాదులుపాప, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, మట్ట రాజిరెడ్డి, మహిళా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఎంపిటిసిలు, వార్డ్ మెంబర్లు, గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *