మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందండి.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి.
మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 22, 2025:
బ్యాంకులు, భీమా సంస్థలు, పోస్టాఫీసులలో క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం ‘మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ ఖాతాలలో ఉన్న డిపాజిట్లు, భీమా సంస్థలలో మిగిలిపోయిన డబ్బులను సంబంధీకులు పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని, ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 1 లక్షా 38 వేల ఖాతాలలో 32.7 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయని తెలిపారు. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలనే ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐ.ఆర్.డి.ఎ.ఐ., పి.ఎఫ్.ఆర్.డి.ఎ. వంటి జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, భీమా సంస్థలు ఉమ్మడిగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయని, ప్రత్యేక శిబిరంలో ఆస్తుల క్లయిమ్ విధానంపై మార్గ నిర్దేశం ఇవ్వడం జరుగుతుందని, బ్యాంకులలో క్లయిమ్ చేయని డిపాజిట్లు ఉన్న వారు ఉద్గం వెబ్సైట్ ద్వారా వివరాలు పొందవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





