ప్రాంతీయం

త్రివర్ణ పథకాన్ని బిజెపి పట్టణఅధ్యక్షుడు చేతుల మీదుగా ఆవిష్కరణ…

269 Views

ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు15, పంద్రాగష్టు జండా పండగ వేధికగా బయటపడిన బీజేపీ గ్రూపు తగాదాలు… మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహంవద్ద భారతీయ జనతాపార్టీ నాయకులు జాతీయ జండాని ఎగరేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే మంగళవారం నాటి జండా పండగతో బీజేపి నాయకుల్లో ఉన్న గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జాతీయ త్రివర్ణ పథకాన్ని ఎగరవేశారు. దీంతో తమకు దక్కాల్సిన రాజకీయ స్థానం దక్కలేదనే భావనతో మండల అధ్యక్షుడున్నట్లుగా కండ్లకి కట్టినట్టు కనిపిస్తుందని బీజేపీలో పనిచేసే కార్యకర్తలు నిబద్దతతో పనిచేస్తారనేది జగమెరిగిన సత్యంలాంటిది మండలంలో ఆదిపత్య పోరుతో అటు పార్టీకి ఇటు నాయకులకి రాజీకయ భవిష్యత్తు శూన్యంగా మారనుందని భారతీయ జనతాపార్టీలో కూడా పరాయి గ్రామస్థుల పెత్తనం సెంటిమెంట్ నేటితో తేలిపోయిందని పార్టీలోనే ఉంటూ ఇతర పార్టీలకి తొత్తులుగా మారిన మండల నాయకత్వగణాన్ని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శించారు. పార్టీలో జరిగే అంతర్గత విషయాలన్నీ పొరుగువారికి చేరవేస్తున్నారని అపవాదు మండల నాయకులపై ఉంది. ఈ సమయంలో పార్టీని పార్టీ సిద్దాంతాలని పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులని జనాలలోకి తీసుకెళ్ళాల్సిన మండల స్థాయి నాయకులు అవన్నీ మరిచిపోయి గ్రూపు తగాదాలు చేయడం శోచనీయం మన్నారు గ్రూపు తగాదాల లాంటి సంఘటనలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికయినా జిల్లా నాయకత్వం మండలంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. పార్టీలో గ్రూపు తగాదాలపై రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉన్నా కిందిస్థాయి నాయకులు మాత్రం నిత్యం ఏదో ఒక సమస్యతో జిల్లా నాయకులకి తలనొప్పిగా మారాయని పలువురు పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఏదునూరి గోపి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు మీసశంకర్, పిఎసిఎస్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, ఒరగంటి సత్యం, బండి శ్రీకాంత్, ధరంసూత్ ప్రకాష్ నాయక్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *