*కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*
*కౌటాల:* మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 100 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే 5 సంవత్సరాలు అర్హులైన ప్రతి ఒక్కరి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముభారక్ ఫైల్ తన వద్ద పెండింగ్ లో ఉండవని వెను వెంటనే సంతకాలు చేసి ఎమ్మార్వోలకు పంపుతామని, తనకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పని చేసి పెడతానని అన్నారు. అలాగే మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకువస్తామని తెలియజేశారు.*





