ఎల్లారెడ్డిపేట,30 జూలై 2023.
గౌడన్నల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను గౌడ సామాజిక వర్గం ముక్త కంఠంతో ఖండించాలని మండల గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండల గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ కు మద్దతుగా మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, జిల్లా డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు ముష్కం దత్తాద్రి గౌడ్, ప్రధాన కార్యదర్శి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ మండల నాయకులతో కలిసి చిదుగు గోవర్ధన్ గౌడ్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ జిల్లాలోని గౌడ సామాజిక వర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అటువంటి వారిపైన అక్రమ కేసులు పెట్టి గౌడ్ ల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. గౌడన్నల ఐక్యతను కొందరు దెబ్బతీసే కుట్రలను గౌడ నాయకులు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.సామాజిక మాధ్యమాల్లో చిదుగు గోవర్ధన్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొందరు అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు.సామాజిక మాధ్యమంలో వచ్చిన తన వ్యాఖ్యలను తిరిగి వెనకకు తీసుకుంటున్నానంటూ చిదుగు గోవర్ధన్ గౌడ్ ప్రకటించిన కూడా కొందరు కావాలని చిదుగు గోవర్ధన్ గౌడ్ ను అప్రదిష్టపాలు చేస్తున్నారని పేర్కొన్నారు.మంత్రి కేటీఆర్ సలహా సూచనల మేరకు తన సొంత నిధులతో బొప్పాపూర్ లో 24 లక్షల వ్యయంతో రైతు వేదిక నిర్మించి మంత్రి ప్రశంసలు పొందారని పేర్కొన్నారు.గౌడన్నల కుటుంబాలకు ఆపదలో నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయం, పేద పిల్లలకు ఫీజులు అందిస్తూ చిదుగు గోవర్ధన్ గౌడ్ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.ఇప్పటికైనా చిదుగు గోవర్ధన్ గౌడ్ పై పెట్టిన అక్రమ కేసులను వాపస్ తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు కోరారు. జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ నాయకత్వంలో పూర్తి మద్దతుగా నిలుస్తామని మండల గౌడ సంఘం నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోల నారాయణ గౌడ్, కోశాధికారి పందిర్ల సుధాకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి జవ్వాజి మహేష్ గౌడ్, బండలింగంపల్లి మాజీ సర్పంచ్ బాలరాజు నర్స గౌడ్, మండలంలోని అన్ని గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు, మండల డైరెక్టర్లు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
