ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక విగ్రహాల నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలని,నిమార్జనం రోజున డిజె లకు అనుమతి లేదని,భక్తి శ్రద్దలతో ఒకే రోజులో నిమజ్జనం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సోమవారం టెక్స్ టైల్ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ శాఖ, ప్రజా ప్రతినిధులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, గణేష్ మండప నిర్వహకులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో శాంతియుత వాతావరణం లో పండుగలను జరుపుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలువలన్నారు.గణేష్ శోభయాత్ర,మిలాద్ ఉన్ నబి పండుగలు ఒకే రోజు రావడంతో శాంతి భద్రతల దృష్ట్యా ముస్లిం మత పెద్దలు పోలీస్ శాఖ వారి సూచనల మేరకు మిలాద్ ఉన్ నబి వేడుకలు అక్టోబర్ ఒకటవ తేదీన జరుపుకోవడానికి ఒప్పుకోవడం జరిగిందన్నారు.




