ప్రాంతీయం

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ

62 Views

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ

గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం

బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

తెలంగాణ-మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి

సెప్టెంబర్ 17

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్తులకు అన్న ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్న ప్రసాద వితరణ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్రస్ట్ ద్వారా “ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం” అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని,మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ గార్లు తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, ఎస్ డి షాహీన్,డాక్టర్ లు ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు ,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్