Breaking News

గాయకులతో కలిసి పాటపాడిన: ఎమ్మెల్సీ కవిత* హైదరాబాద్:ఆగస్టు 14

123 Views

*గాయకులతో కలిసి పాటపాడిన: ఎమ్మెల్సీ కవిత*

హైదరాబాద్:ఆగస్టు 14

బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో సోమవారం విడుదల చేశారు.

ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాటపాడారు. జాగృతి యాప్‌లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి.

కాగా, ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తిచేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తున్నది. దీనికోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్  8985699999ను కేటాయించింది. ఆ నంబర్‌కి వాట్సాప్ ద్వారా పాటలను పంపించాలని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనును అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *