Breaking News రాజకీయం

నేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌

113 Views

నేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌

మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది.

జియోట్యాగింగ్‌ అయిన ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకుఖాతాలో ప్రతినెలా రూ.3వేల చొప్పున నగదును జమచేయనున్నది.

చేనేతమిత్ర పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల కుటుంబాలకు లబ్ధి

మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌
తొలిసారిగా కార్మికుల ఖాతాల్లో నగదు జమ
ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు రాష్ట్ర హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌

కార్మికులకు ప్రత్యక్ష సహాయం చరిత్రాత్మకం
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: శాసనమండలి సభ్యుడు ఎల్‌ రమణ

మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జియోట్యాగింగ్‌ అయిన ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకుఖాతాలో ప్రతినెలా రూ.3వేల చొప్పున నగదును జమచేయనున్నది. శుక్రవారం తొలి సాయం జమ కావడంతో నేతన్నల ఆనందానికి అవధుల్లేవు.

చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిలబెట్టుకున్నారు. చేనేతమిత్ర పథకం కింద అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జమ చేసింది. చేనేతమిత్ర పథకం ద్వారా ఇప్పటివరకు నూలు, రంగులు, రసాయనాలకు 50% సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తున్నది. అయితే వివిధ కారణాలతో ఈ సబ్సిడీలు కార్మికులకు సకాలంలో అందడం లేదు. ఈ నేపథ్యంలో ఇకపై జియో ట్యాగింగ్‌ ద్వారా ట్యాగ్‌ అయిన ప్రతి మగ్గం కార్మికునికి నెలకు రూ.3 వేల చొప్పున జమ చేస్తామని, ఇందులో యజమానికి రూ.2 వేలు, అతనికి సహాయకుడిగా ఉండే వారికి వేయి చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి కేటీఆర్‌ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా సెప్టెంబర్‌ 1న కా ర్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఆ వెంటనే చేనేత కార్మికుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జియో ట్యాగింగ్‌ చేసిన 32 వేలకుపైగా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరింది. ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ పథకం అమలుకు ఏడాదికి దాదాపు రూ.100 కోట్లకుపైగా నిధులు అవసరమని అంచనా. చేనేత కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అయినందుకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాసర్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, పవర్‌లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఖాతాల 3 వేలు పడ్డయ్‌

నాకు 52 ఏండ్లుంటయ్‌. 30 ఏండ్ల నుంచి వృత్తినే నమ్ముకున్న. నా లాంటోళ్ల కోసం ‘చేనేతమిత్ర’ పథకం కింద స ర్కారు 3 వేలు ఇస్తున్న ది. నాకు ఈరోజే బ్యాం కు ఖాతాల జమైనయ్‌. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు చేనేత కార్మికులంతా రుణపడి ఉంటరు. గతంలో మమ్మల్ని ఏ సర్కారు కూడా ఇట్లా ఆదుకోలేదు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్‌ సార్‌ ముఖ్యమంత్రి అయినంకనే చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నరు.

– దాసరి శ్రీనివాస్‌, చేనేత కార్మికుడు, కొండపల్కల గ్రామం, మానకొండూర్‌ మండలం, కరీంనగర్‌ జిల్లా

మా జీవితాల్లో వెలుగులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే చేనేత పనులు మంచిగా నడుస్తున్నాయి. మా బతుకులకు భరోసాగా చాలా మంచి పథకాలు తీసుకొచ్చిండ్రు. పింఛన్‌ ఇస్తున్నరు. చనిపోతే చేనేత బీమా కింద రూ.ఐదు లక్షలు ఇస్తున్నరు. ఇంతకుముందు ఎవరూ ఇయ్యని విధంగా ఇప్పుడు రూ.3 వేలు ఇస్తున్నరు. గతంలో ఇలా పట్టించుకున్న వారే లేరు. ఇప్పుడు అడుగక ముందే అన్నీ ఇస్తున్నరు. చేనేతలకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

– పెద్ది సత్తయ్య, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి

కేసీఆర్‌కు ధన్యవాదాలు

దేశంలో ఇలాంటి స్కీంలేదు. ఏపీలో నెల కు 2 వేలు ఇస్తుండగా తె లంగాణలో 3 వేలు ఇస్తున్నారు. చేనేత కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. చేనేత కార్మికుల కండ్లలో ఆనందం కనిపిస్తున్నది. ఈ పథకాన్ని అమలుచేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు చేనేత కార్మికుల పక్షాన ధన్యవాదాలు.

– చింతా ప్రభాకర్‌, రాష్ట్ర హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

చారిత్రక నిర్ణయం

చేనేత కళాకారులకు నేరుగా వారి అకౌంట్‌లో ప్రతి నెలా రూ.3,000 చొప్పున తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష సహాయాన్ని అందించడం చారిత్రక నిర్ణయం. దేశంలో ఎకడా లేనివిధంగా చేనేత కార్మికుల కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యం, రూ.25 వేల హెల్త్‌ఇన్సూరెన్స్‌ను నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

– ఎల్‌ రమణ, ఎమ్మెల్సీ

కార్మికులకు చేయూత

స్వరాష్ట్రంలో చేనేత కార్మికులకు మంచి రో జులొచ్చాయి. చేనేతమి త్ర పథకం కింద 3 వేలు అందించడం సంతోషం గా ఉన్నది. చేనేత కష్టా లు తెలిసిన సీఎం కేసీఆర్‌ మాకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పూర్వవైభవం సంతరించుకున్నది. చేనేత కార్మికులు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.

-అక్కల శాంతారాం, చేనేత కార్మికుడు, గద్వాల

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *