Breaking News

హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం..*

98 Views

*హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం..*

 

ఉలవపాడు: నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి పాల్పడ్డారు..

 

ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

 

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు రైలులోని ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద ఉన్న సుమారు 30 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం తెట్టు సమీపంలో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి చోరీకి పాల్పడబోతుండగా.. రైలులోని పోలీసలు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఆ తర్వాత రైలు ముందుకు కదిలింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ఒంగోలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *