శివంపేట మండలం మెదక్ జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న రెండవ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంల సంఘం అధ్యక్షురాలు శారద రిమైండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విధులు బహిష్కరించి సమ్మె నోటీసును తహసిల్దార్ శ్రీనివాసచారికి మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కు కు సమ్మె నోటీసు ను అందజేశారు. సందర్భంగా శారద మాట్లాడుతూ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల లందరినీ ఎలాంటి పరీక్షలు లేకుండా రెగ్యురేషన్ చేయాలని హెల్త్ వర్కర్ నోటిఫికేషన్ 2/ 2023 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల 16 నుంచి నిరవధిక సమ్మె చేనున్నట్లు తెలిపారు. సుమతి, సుగుణ ,లక్ష్మి, స్వర్ణలత, దీనా, శేకమ్మ, మాధవి ఉన్నారు.