ప్రాంతీయం

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

297 Views

దౌల్తాబాద్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ లో బీఆర్ఎస్వి, యూత్ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ యూత్ అధ్యక్షుడిగా దారస్వామి, ఉపాధ్యక్షుడిగా ఎండి. ఆఫ్సర్, బీఆర్ఎస్వీ గ్రామ అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షుడిగా రాజు, సోషల్ మీడియా కన్వీనర్లుగా కోటిరాజు, పరుశరాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీలను వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిలుక వైకుంఠం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్, నాయకులు పరుశరాములు, స్వామి, శ్రీనివాస్, కరుణాకర్, రామచంద్రం, సిద్ధులు, కొంగరి స్వామి, రాజు, మహేందర్, గణేష్, రాములు, షాదుల్లా, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు…..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *