ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి సిరిసిల్ల ఫిబ్రవరి 2, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కొరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆకుల జయంత్ కుమార్ అధ్యక్షునిగా భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. జయంత్ కుమార్ 56 ఓట్లతో విజయం సాధించగా ప్రత్యర్థులు ఆకునూరి శంకర్ కు 01. ఆసరి మహేష్ కు 02. ఓట్లు సాధించగా చిటికన్ జగదీష్ కు 22 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన కార్యదర్శి ఇద్దరు పోటీ పడగా పరకాల ప్రవీణ్ 58 ఓట్లతో విజయం సాధించగా సుకుమార్ కు 23 ఓట్లు పోలయ్యాయి సహాయ కార్యదర్శులుగా రాపెల్లి భాస్కర్ 52 ఓట్లతో విజయం సాధించగా బైరి మదుకు 29 ఓట్లు పోలయ్యాయి. కోశాధికారిగా 50 ఓట్లతో కాయితి మహేందర్ విజయం సాధించగా సిద్దుల మురళికి 31 ఓట్లు పోలయ్యాయి. 11 మంది కార్యవర్గ సభ్యులుగా పోటీ పడగా దాసరి శిరీష 68 ఓట్లు. అల్లే రమేష్ 62 ఓట్లు. అహ్మద్ అన్సారి ఆలీ 54 ఓట్లు, జానా దయానంద్ 52 ఓట్లు, నాయి బాబు 52 ఓట్లు, జక్కని రాజా రమేష్ 45 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు రాపెల్లి సంతోష్ కుమార్, కరణాల భద్రాచలం, తడుక విశ్వనాథం, మేడి కిషన్, ఇరుకుల ప్రవీణ్ కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల జయంత్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు. ఎన్నికల అధికారులకు సీనియర్ జర్నలిస్టులు కాంభోజ ముత్యం, మచ్చ ఆనందం, పాలమాకుల శేఖర్, సహాయకులుగా వ్యవహరించారు.
