శేరి పల్లి లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 49 వేల విరాళం..
వర్గల్ మండలం శేర్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహానికి గాను గ్రామానికి చెందిన భూమిగారి వినయ్ గౌడ్ రూ. 49 వేల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన దళిత సంఘం నాయకులు గొలనుకొండ నర్సింలు, గోలకొండ శ్రీనివాస్, మల్లయ్య ,శివ నాగరాజు ,మొగలి ,రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.
