Breaking News

బీసీలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం…. –ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్. (తిమ్మాపూర్ ఆగస్టు 12 ది క్రైమ్ న్యూస్ ) లక్ష రూపాయల ఋణం ఇస్తామని హామీ ఇచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం బిసీ వర్గాలను మోసం చేస్తున్నదని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ ఆరోపించారు.బిసీ లకు జరుగుతున్న మోసాలపై రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మండలాల వారిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శనివారం మండలంలోని రామక్రిష్ణకాలనీ లో ఓబీసీ మండల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే విగ్రహం వద్ద నల్ల రిబ్బన్ లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని బిసీ లను మోసం చేసిన కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్, మండల పార్టీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్నటువంటి బిసీ వర్గాలందరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని అన్నారు.ఇప్పటికైనా స్పందించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడించడానికైనా సిద్దమేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దుర్సెట్టి రమేష్,జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,అధికార ప్రతినిధి తాళ్లపెల్లి రాజు గౌడ్,జిల్లా ఈసీ మెంబర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి చెపూరి దిలీప్, చెన్నబోయిన శ్రీనివాస్,కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,కిన్నెర ముత్తిలింగం,భూతం కుమార్,రావులకారి సుధాకర్, కోతి రాజు,సోన్నాకుల శ్రీనివాస్, భూతం లక్ష్మణ్,రేగూరి సుగుణాకర్, రెవెల్లి శ్రీనివాస్, వేములవాడ శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.

79 Views
Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *