రామ నామమే శాశ్వతం లిఖించి, తరించండి
అద్దాల మందిరం వద్ద శ్రీరామునికి అభిషేకాలు నిర్వహించిన
సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 27
ఆషాడ మాస శనివారం సందర్బంగా శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్షలాది భక్తులు లిఖించినటువంటి రామ నామాలతో అద్దాల మందిరంలో కొలువైన సీతారాములకు లిఖిత రామ నామాలతో ప్రత్యేకంగా అభిషేకించారు సంస్థ అధ్యక్షులు భక్తిరత్న రామకోటి రామరాజు .ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయి. అలాంటి నామాన్ని ప్రతి ఒక్కరు లిఖించాలన్నారు. యువతీ, యువకులు, వృద్దులు చదువు రాని వారు సైతం కోట్లాది సంఖ్యలో రామ నామాన్ని లిఖించి తరిస్తున్నారన్నారు. చివరికి తోడుండేది రామ నామం అక్కటే అన్నారు.రాముడు ధర్మానికి ప్రతిరూపం, రామరాజ్యం సంక్షేమానికి ప్రతిబింబం, రామనామం వేదాల సారం, రామ తత్వమే మానవత్వం అన్నారు. రామకోటి వ్రాయాలనే రామకోటి పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
