ప్రాంతీయం

సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

48 Views

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

సరస్వతీ పుష్కరాల్లో పాల్గొన్న పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాళేశ్వరంలో 11 వ రోజు జరుగుతున్న పుష్కరాల్లో భాగంగా మంత్రి సీతక్క…స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పుష్కర స్నానం ఆచరించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ.

త్రివేణి సంఘంలో పుణ్య స్థానం ఆచరించి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ. తర్వాత కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని సరస్వతి హారతిలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క.

వంశీ  కామెంట్స్

ఈరోజు మంత్రి సీతక్కతో పుష్కర స్నానం ఆచరించడం చాలా ఆనందంగా ఉంది.10 రోజులనుండి ఇక్కడ సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తున్నారు.ఈ సరస్వతి పుష్కరాలు నాకు కొంచెం బాధ కలిగించాయి.కాలేశ్వరం పుష్కరాలు నాకు చాలా నేర్పించాయి.నేటి సమాజంలో కులాన్ని బట్టి ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.కులాన్ని బట్టి విలువ ఇవ్వడం చాలా బాదేస్తుంది.సరస్వతీ పుష్కరాల్లో నాకు అండగా ఉండి నా వెంట ఉన్న అన్ని కుల సంఘాలకు కృతజ్ఞతలు.రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి నా వెన్నంటి ఉండి అధికారులను,ప్రశ్నించారు.కులం కంటే డబ్బు చాలా గొప్పది అని ఈ పుష్కరాల వల్ల తెలుసుకున్నాను.

రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 అందరికీ సమానత్వం కల్పించింది.

పుష్కరాల్లో పాల్గొన్న భక్తులు అందరూ తాము కోరుకున్నది నెరవేరాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్