దౌల్తాబాద్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పిజిటి పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ తెలిపారు. పిజిటి ఇంగ్లీష్, టిజిటి సోషల్ సబ్జెక్టులను గంటల ప్రాతిపదికన బోధించుటకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శనివారం పాఠశాలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. వేతనం నెలకు రూ. 18200 చెల్లించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపికైన వారు ఇంగ్లీష్ మీడియం లో బోధించాలని సూచించారు.




