ముస్తాబాద్, మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో గణపయ్యను నిమర్జనానికి తీసుకు వెళ్తున్న సందర్భంలో ముస్తాబాద్ గౌడసంఘం అధ్యక్షుడు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజించి..’జై జై గణేశా’ అంటూ భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ నిమజ్జనానికి వెళుతుండే క్రమంలో సీఐ
సదన్ కుమార్ వీరితో కాసేపు భజనలు చేసి అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సిఐ సదన్ కుమార్ ను సన్మానించి గణనాధుని ప్రసాదాలు అందించారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.




