ప్రాంతీయం

వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు – బిజెపి

54 Views

*బీజేపీ పార్టీ పై మరియు జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు*

*ఇటీవల మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ పై తప్పుడు ఆరోపణలు మరియు జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పై చేసిన తప్పుడు ఆరోపణలు ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిరీ జిల్లా కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పట్టి వెంకట కృష్ణ  మరియు దుర్గం అశోక్  పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.*

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటివల కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ పై మరియు జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పై చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలు సమయంలో ఇచ్చిన 6 గ్యారింటలను అమలు చేయాలని, రైతులందరికీ రైతు భరోసా, రుణ మాఫీ, నీట మునిగిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే రఘునాథ్  పై మరియు బీజేపీ పార్టీ అసత్య ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మంచిర్యాల జిల్లాకు నిధులు రాక జిల్లాకు అన్యాయం జరిగింది.నిధులు తీసుకురావాలని జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే రఘునాథ్  పై పరుష పదజాలంతో దుషిచడం సిగ్గు చేటు అని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ పార్టీకి మంచిర్యాల అసెంబ్లీ లో ప్రతి పక్ష హోదా ఇచ్చారని ప్రజల తరఫున ప్రజల సమస్యల పై మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పై రఘునాథ్ నాయకత్వంలో నిత్యం పోరాడుతూనే ఉంటాం అని తెలిపారు. అదే విధంగా రఘురఘునాథ సేవ కార్యక్రమాల పై కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శ చేయడం సరికాదు అని ప్రజలకు మేలు చేయాలని ఎవరు సేవ కార్యక్రమాలు చేసిన సమర్ధించాలని రఘునాథ్  చేసినంత సేవ కార్యక్రమాలు ఈ జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా చేయలేదని తెలిపారు. ప్రజలకు కరోనా కష్ట కాలంలో బాధితులకు మెడికల్ కిట్లు, కుటుంబ పెద్దలను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం మరియు వరదల తో నష్ట పోయిన వారికి నష్ట పరిహారం ఇలా చెప్పుకుంటూ పోతే కష్టం ఎక్కడ ఉంటే అక్కడ రఘునాథ్  సేవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అదే విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నిధులు ఇవ్వడం లేదు అని చేస్తున్న ఆరోపణలు అర్థరహితం అని జిల్లాకు చంద్రాపూర్ – మంచిర్యాల, నాగపూర్ – విజయవాడ, ఆర్మూర్ – మంచిర్యాల జాతీయ రహదారుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ది అని అన్నారు. అదే విధంగా ప్రతి గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ లో చేపడ్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయే తప్ప అందులో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి కూడా లేదు అని అన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా ప్రజలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకొని జిల్లా అభివృద్ధి పై, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పై దృష్టి పెట్టాలని ఇంకొకసారి బీజేపీ పార్టీ పై మరియు రఘునాథ్  పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ పార్టీ తరపున రఘునాథ్  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మరియు ప్రజల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తామని మీ బెదిరింపులకు మరియు మీ అక్రమ కేసులకు భయపడేది లేదని నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పట్టి వెంకట కృష్ణ, దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, మోటపలుకుల తిరుపతి, పానుగంటి మధు, మధవరపు రమణ రావు, బొద్దున మల్లేష్, కర్ర లచ్చన్న, కశెట్టి నాగేశ్వర్ రావు, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, మెట్పల్లి జయరామ్ రావు, ముదాం మల్లేష్, బియ్యాల సతీష్ రావు, పల్లి రాకేష్, అమీరిషేట్టి రాజు, బింగి ప్రవీణ్, పచ్చ వెంకటేశ్వర్లు, పూదిరీ రామ్ చందర్ రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రెన్వా, బల్ల రవి, ఆర్ణకొండ శ్రీనివాస్, సత్యనారయణ, కుర్ర చక్రవర్తి, శ్రీనివాస్, అరేందుల శ్రీనివాస్, కల్వచెర్ల అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్