Breaking News

నేరాల నిర్మూలన కోసమే “కమ్యూనిటీ కాంటాక్ట్

155 Views

*నేరాల నిర్మూలన కోసమే “కమ్యూనిటీ కాంటాక్ట్:డిఎస్పీ నాగేంద్రచారి.*

నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారి ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం అని వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు..

*రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి సరైన పత్రాలు చూపించి తీసుకవేళ్ళవచ్చు అన్నారు.గొళ్ళెం రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా జంతువులను వేటాడాటానికి ఏర్పాటు చేసుకున్న వల స్వాధీనం చేసుకొని గొళ్ళెం రెడ్డి బైండోవర్ చేయడం జరిగింది.*

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…
పోలీసులు ఉన్నది ప్రజల రక్షణకే అని, ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించ డానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తు లు అనుమానాస్పదంగా కనిపిస్తే, పోలీసులకు లేదా డయల్100 కి సమాచారం అందించాలని కోరారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని,యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.గ్రామాల్లో కి గంజాయి మూలాలు రాకుండా చూసుకోవలసిన బాధ్యత గ్రామ ప్రజలాదే అని అలాంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా,ట్రాఫిక్ నియమాలను పాటించాలని,వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని,గ్రామాల్లో అటవీ జంతువులను వేటాడిన అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమార్చన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని,animal act గురించి వారికి తెలియజేయడం జరిగింది.

గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.అదేవిధంగామొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేయండి.పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం వెళ్లే వారి నకిలీ గల్ఫ్ ఏజెంట్లు ను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ ఆమోదిత ఆశ్రయించాలని అన్నారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల కు సంబంధించిన సమాచారం ఉన్న గల్ఫ్ ఏజెంట్లను ఆశ్రయించే ముందు *స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ 8712656411* ను సంప్రదిస్తే ఏజెంట్ల కు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ కిరణ్ కుమార్, ఎస్.ఐ లు రాజేష్, మారుతి, అశోక్,పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *