ముస్తాబాద్,
ప్రతినిధి సెప్టెంబర్25. తెలంగాణ బహుజన చైతన్యానికి మహిళాశక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య, ఆర్డీఓలు, ఆనంద్ కుమార్, మధు సూదన్ జిల్లా రజక సంఘాల నాయకులు వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.




