కోమటి చెరువు అందాలను చూసి ముగ్ధుడైన రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి. బుధవారం సిద్దిపేటకు వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి కి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దగ్గరుండి సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు అందాలను చూపించారు. మ్యూజికల్ ఫౌంటెన్, హ్యాంగింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రూబీ నెక్లెస్ రోడ్ మరియు నూతనంగా నిర్మిస్తున్న డైనోసార్ పార్క్ ను చూపించి వాటి వివరాలను మంత్రి తన్నీరు హరీష్ రావు తెలుపగా ఇంత అద్భుతమైన పార్కు సిద్దిపేటలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా అద్భుతంగా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట సూర్యాపేట అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రియాంక, మరియు ఇతర శాఖల అధికారులు ఉన్నారు.




