విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు పండగ….: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో మహిళలు గ్రామ దేవతలకు గురువారం ఘనంగా చలి బోనాల పండుగా నిర్వహించారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ దేవతలైన మీదిపేట పోచమ్మ , కిందిపేట పోచమ్మ , నల్ల పోచమ్మ , ముత్తడి పోచమ్మ లకు గురువారం సాయంత్రం చలి బోనం తీశారు, ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని ,విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులను ,పిల్లపాపలను చల్లగా చూడాలని పాడి , పంట , వృత్తి లాభాలతో నడవాలని గ్రామదేవతలైన పోచమ్మ దేవతలను వేడుకున్నారు, బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు , ఈ వేడుకల్లో చందనం శంకరమ్మ, బాగ్యమ్మ , పాలోజి రమ. చందన, రామలక్ష్మి విజయ , రత్న , నీలీమా, శ్రీమతి,లావణ్య ,ఉమ , అనిత,రజిత , కోడిమోజు లహరి , తుమ్మలపల్లి మణెమ్మ, రాజేశ్వరి నల్లనాగుల వెంకటలక్ష్మిలు తదితరులు పాల్గొని , బోనమెత్తారు ,




