ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, బంధనకల్ గ్రామం బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో ఓకారు టీఎస్ 22జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనకారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాలు
హుటా హుటిన హాస్పిటల్ తరలించారని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కారు సిద్దిపేట్ నుండి ముస్తాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
