సోనియా గాంధీ పై కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం రాస్తారోకో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో శుక్రవారం సోనియా రాహుల్ గాంధీ లపై ఈడి కేసుల కు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి గంటసేపు రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ
*AICC అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ గార్ల పైన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఈడీ కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు గతంలో ఈ కేసులను కోర్టు కొట్టివేసిన తిరిగి ఈడీ ప్రశ్నించడం అన్యాయం అన్నారు ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలన్న సంకల్పంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు E.D, CBI ల ద్వారా విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు ఈ రాస్తారోకోలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ నాయకులు గంట బుచ్చగౌడ్ కొత్తపల్లి దేవయ్య ఎల్లా గౌడ్ హిమాం మహేందర్ కిషన్ రాములు మానుక నాగరాజ్ మొగుళ్ల మధు బాలు యాదవ్ నందు బాలరాజు రెడ్డి మల్ల సత్యనారాయణ కరికే శ్రీను పందిర్ల శ్రీనివాస్ సురేష్ రాజు నాయక్ చిన్నిబాబు రామ్ రెడ్డి గుండ్ల శ్రీనివాస్ చారి రఫీక్ మహమ్మద్
