పేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST
-అజ్మీరా రాజు నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు
కేంద్ర సర్కారు పని తీరు పేదలను కొట్టి పెద్దల జేబులు నింపే ప్రక్రియకు కేంద్ర బిందువుగా gst ఉందని బంజారా సంఘం జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్ తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఆయన గురువారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం నేడు gst వంకతో సామాన్యుల నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులైన పాలు, పెరుగు పై కూడా gst విధించడం ఎంత వరకు సబబన్నారు. సామాన్యుల ఉసురు తగిలి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. తక్షణమే పాలు, పెరుగు పై విధించిన 5 % gst ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షములో బంజారా సంఘం తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
ఈ కరిక్రమంలో బంజారా సంగం ప్రదాన కార్యదర్శి
గొపి నాయక్ సర్పంచ్ భుక్యా ప్రభు నాయక్ , ప్రబాకర్ , లింబాద్రి పాల్గొన్నారు
