ప్రాంతీయం

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.

193 Views

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.

* టిడిపి దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్.

 అసమర్ధత నిర్లక్ష్యం తోటే టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని తెలుగుదేశం పార్టీ దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్ గుప్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ల ఆదేశాల మేరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల రూపంలో ప్రచురించి మండల కేంద్రం రాయపోల్ లో ఆదివారం పల్లె పల్లెకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీనీ స్థాపించారని, పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలలో నిరంకుశంగా వ్యవహరించే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేన్నారు. కూడు గూడు గుడ్డ అనే నిదానంతో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే హైటెక్ సిటీ నీ నిర్మించాడని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించే తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీగా ముద్రవేశారని, మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి ఆంధ్రకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణాన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకు ఓర్చి తమ పిల్లలను చదివిస్తే టీఎస్పీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందని ఇది అధికారుల కుంభకోనమా, ప్రభుత్వ కుంభకోనమా, అవినీతి కుంభకోనమా అర్థం కావడం లేదు అన్నారు. ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం లో ఇరుక్కోవడంతో రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం ఢిల్లీలో సాయంత్రం హైదరాబాదులో ఉంటున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతుందని, ఈడి విచారణకు ఎందుకు తప్పించుకుని తిరుగుతుంది అన్నారు. చట్టానికి అందరూ సమానులేనని తప్పు చేసిన వారికి తప్పకుండా కఠిన శిక్ష పడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చినప్పుడే ఆ పార్టీ నైతికంగా ఓడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు ఆకుల రాములు, టిడిపి రాయపోల్ మండల అధ్యక్షులు కూరాకుల మహేష్, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు పులి గారి రమేష్ గౌడ్, దుబ్బాక మండల అధ్యక్షులు రాహుల శంకర్ గౌడ్, అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షులు జీడిపల్లి లింగం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెంబర్తి భాస్కర్, దుబ్బాక నగర పంచాయతీ అధ్యక్షులు ర్యాకం రవీందర్, దౌల్తాబాద్ ప్రధాన కార్యదర్శి పేరుమండ్ల నర్సింలు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *