ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 మండల కేంద్రంలో రెండవ ఏఎన్ఎంలను ఎలాంటి పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉత్తరము పంపించిన రెండవ ఏఎన్ఎంలు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంజాయ్సి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని ఎన్నో సభలలో చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి అనుకున్న మాదిరిగానే వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసేందుకై 26-02-2016న జీవో నెంబర్16,కూడా విడుదల చేశారు. ఆజీవో నెంబర్ 16 అనుసరించి ఏప్రిల్ 30,వ తేదీన 5554 మందిని రెగ్యులర్ చేశారు. అందులో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా ఉన్నారు. గత15 సంవత్సరాల నుండి ఎన్ హెచ్ ఎం లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని భేషరతుగా రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం. సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారని తమ దృష్టికి ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాము. అందుకనే మేము ఎవరో తెలియాలన్న ఉద్దేశంతో మేము తమకు వ్యక్తిగతంగా ఉత్తరం రాస్తున్నాము. ఒకవైపు మేము తమని బేషరతుగా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేశాం. వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావుకు కూడా కలిసి విన్నవించాం. ఒకవైపు మేము ఆందోళనలో వినతిపత్రాలు, ఇస్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎంపిహెచ్ డబ్ల్యు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జులై 26న 1520 పోస్టులను మంజూరు చేయడం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మా వంతుగా మేముకూడా పోరాటంలో పాల్గొన్నాం. దాదాపు 45 రోజులపాటు మాజీతాలను వదిలేసి పోరాటంలో పాలుపంచుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పరచుకున్న లక్ష్యాలను నెరవేర్చటంలో మావంతు కృషి చేశాం. కాయకల్ప అవార్డులు తెలంగాణకు రావడానికి మాకృషికి కూడా ఉందని తమకు సగర్వంగా తెలియజేస్తున్నాం. 33 రకాల రికార్డులను ఆన్లైన్ ఆఫ్లైన్ లో మేము చక్కదించుతున్నాం. పల్లెటూరులో ఆరోగ్య తెలంగాణ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మేము చేసే పని, రెగ్యులర్ ఏఎన్ఎం చేసే పనిఒకటే, మాఇద్దరి చదువు కూడా ఒకటే అయినప్పటికీ మాఇద్దరి మధ్య జీతాలలో మూడు వంతుల తక్కువగా మాకు వ్యత్యాసం ఉన్నది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము అడిగి వేసారి పోయాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని ఆశించాం. కానీ రెండవసారి తెరాస అధికారంలోకి రావడానికి మావంతు కృషిచేశాం. ఎందరి జీవితాల్లో వెలుగును నింపుతున్న మీరు మాజీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాం మా న్యాయమైన డిమాండ్ల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దుచేసి, మమ్మల్ని కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా రెగ్యులైజేషన్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏఎన్ఎంలు.
