Breaking News

ఈ నెల 29, ’30, తేదీలలో స్కూళ్లకు సెలవులు.* 

107 Views

*ఈ నెల 29, ’30, తేదీలలో స్కూళ్లకు సెలవులు.*

హైదరాబాద్‌:ఆగస్టు

ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేదుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది అయితే గ్రూప్‌-2 పరీక్షల కోసం కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

783 గ్రూప్‌-2 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29, 30 తేదీల్లో నాలుగు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

గతంలో జరిగిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ నేపథ్యంలో ఈసారి గ్రూప్‌-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ చర్యలు చేపడుతోంది…

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *