ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు రెండు రోజులు జైలు శిక్ష

57 Views

మద్యం సేవించి వాహనాన్ని నడిపిన ఇద్దరు (02) వాహనదారులకి (02) రోజుల జైలు శిక్ష

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐప్రవీణ్, కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 11మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా ఫిబ్రవరి. 13-ఫిబ్రవరి- రోజున సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసి 11 మంది వ్యక్తులలో (02)ఇద్దరికీ చెరి (02) రెండు రోజుల జైలు శిక్ష మిగతా 09 మందికి రూ.92,000- జరిమానావిధించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని ముగ్గురు వ్యక్తులకి ఒక్కొక్కరికి రూ. 5,000- చొప్పున మొత్తం రూ. 15,000- జరిమాన విధించినారు.జైలు శిక్ష విధించినవ్యక్తివివరాలు1.ఆరెల్లి అనుదీప్, వయసు 36 సం, వృత్తి. బొలెరో డ్రైవర్, నివాసం వరంగల్ పట్టణం. రెండు రోజులు జైలు.2. గుండమైన స్వామి, 53 సం, వృతి. హమాలీ, నివాసం. నాసర్ పుర, సిద్దిపేట పట్టణం. రెండు రోజులు జైలు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంజరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేలరూపాయలజరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పదివేల రూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన రావడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000- రూపాయల జరిమానా విధించడంజరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *