దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు వారి వారి ఉన్నత చదువులు పూర్తిచేసుకుని వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో వేదికగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో స్నేహితులే మొదటి వరుసలో ఉంటున్నారని, కష్టంలో సుఖంలో తోడుండే వారే స్నేహితుడని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ భాస్కర్, లాలు యాదవ్, మహేష్, ప్రభు, కనకరాజు, మహిపాల్ రెడ్డి, ఆంజనేయులు, బుచ్చిరెడ్డి, స్వామి, విఠల్, శ్రావణ్, రాజు, రవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు…..




