గజ్వేల్ పట్టణంలోనీ సమీకృత కార్యాలయ సముదాయంలో గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్
వెంకటస్వామి..ఈ కార్యక్రమంలో ఏంఎల్ సి యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం ఏడు మండలాల నుండి 1053 కళ్యాణ లక్ష్మీ, 56 షాది ముబారక్ లబ్ధిదారులకు 11 కోట్ల 9లక్షల చెక్కుల రూపంలో అందజేశారు. అలాగే జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో కాటమయ్య కిట్లను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి మాట్లాడుతూ..ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. నిరుపేద విద్యార్థులకు మంచి చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించి భవిష్యత్ ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. పాఠశాలలో మాత్రమే కాకుండా ఇంటర్ కళాశాలలో సైతం విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం అందించనున్నట్లు తెలిపారు.జిల్లాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది, దయచేసి ప్రభుత్వ కార్యక్రమాలను వచ్చే మహిళలు ఇందిరమ్మ చీరను ధరించి కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గం కి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయించడం జరిగిందని తెలిపారు. అలాగే 200 కోట్ల తో యంగ్ ఇండియ స్కూల్ స్థాపించి నిరుపేద పిల్లలు కూడా మంచి కార్పొరేట్ స్థాయి చదువును అందించనున్నాము. వైద్యం విషయంలో 10లక్షలు రాజీవ్ ఆరోగ్య శ్రీ పాటు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు ద్వారా రోగులకు భరోసా కల్పించాము. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసి అందులో చదివే పిల్లలకు 2000 రూపాయల స్టైఫాండ్ ఇవ్వడం జరిగింది. మంచి శిక్షణ ఇచ్చి వారికి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించాలని ఆలోచన ఆయా దేశాల్లో ఉద్యోగాలు చెయ్యాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంనని చేపట్టింది.పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు పథకం మంజూరు చేయడం జరిగినది 3500 స్లాబ్ లెవెల్ వచ్చాయని జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు ప్రగతి విజయవంతంగా కొనసాగుతుందనీ అధికారులను అభినందించారు. అలాగే మరికొందరి లబ్ధిదారుల కోసం వారి సొంతింటి కల కల నెరవేర్చడం కోసం వచ్చే నెల రోజులో నియోజకవర్గానికి 2500ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నిరుపేద కుటుంబాలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలు అన్ని విధాల పని చేస్తుందని తెలిపారు.ఈ రబీ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30% ఎక్కువ రావడం వల్ల కొనుగోలు సమస్యలు తలెత్తాయని, అన్ని సమస్యలు పరిష్కరించి, రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ప్రభుత్వం అందజేస్తున్న తన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరవేయడానికి అధికార యంత్రాంగం పనిచేస్తుందని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరవేయనున్నట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉందని, మంజూరైన ప్రతి ఇంటిని పూర్తిచేసేలా అధికారులు పనిచేస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను బలోపేతం చేయడానికి మధ్యాహ్న భోజనంతోపాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకం కూడా అమలు చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని లబ్ధిదారులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్క్రీనింగ్ విషయంలో లబ్ధిదారులు ఎంపికలో పారదర్శకత వహించాలని అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులనుఆదేశించారు.ఆదివారం గజ్వేల్ పట్టణంలో బస్- బే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం, అలాగే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ సైతం పూర్తి చేయించాలని మంత్రిని కోరారు.





