వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పర్యవేక్షించిన డిఎంహెచ్ఓ.
మంచిర్యాల జిల్లా.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగినది ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రములలో ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఈరోజు వేసుకుని ఆ వ్యాక్సినేషన్ డే రోజు వేసుకుని పిల్లల వివరములను దగ్గర ఉంచుకోవాలని అదేవిధంగా అన్ని రకాల వ్యాక్సినేషన్లు వ్యాక్సిన్ లను తీసుకుని వెళ్లాలని ఆదేశించినారు మరియు హెచ్పీవీ వ్యాక్సిన్ కొరకు 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల వివరములను నమోదు చేసుకోవాలని కార్యక్రమం మొదలైన తర్వాత అందరికీ ఇప్పించాలని అదేవిధంగా జాతీయ కార్యక్రమాల్లో భాగంగా 100% గర్భవతుల నమోదు టీకాలు ఇప్పించడం అసంక్రమణ వ్యాధులు డయాబెటిస్ బిపి క్యాన్సర్లను గుర్తించడం 30 సంవత్సరములు పైబడిన వారందరికీ పరీక్షలు చేయించాలని ఆదేశించినారు ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యము కావున వ్యాధులను తొందరగా గుర్తించడం గుర్తించిన వారికి మందులు అందజేయడం మరియు అవగాహన కలిగించడం చేయాలని గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వైద్య శిబిరములను పోలింగ్ స్టేషన్లలో మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్లలో ఏర్పాటు చేయాలని దాని కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లను తయారు చేసుకోవాలని వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని యూనిఫామ్ తో ఉండాలని అదే విధంగా ఎలాంటి మొబైల్ ఫోన్ తీసుకెళ్లరాదని ఆదేశించినారు రేపు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొంటున్న వైద్య సిబ్బంది కిట్టులను వైద్య సిబ్బందిని వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ సిహెచ్ఓ సత్తయ్య సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసినట్లు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీ అధికారి తెలియజేసినారు.





