ప్రాంతీయం

దేశంలోనే మోడల్ గజ్వేల్ పట్టణ అభివృద్ధి అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా

122 Views

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అద్భుతమైన రూపకల్పన గజ్వేల్ పట్టణ అభివృద్ధి .. నిజామాబాద్ ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా ..ఈరోజు గజ్వేల్ పట్టణం లోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని, వైకుంఠధామం, మహిళల ఎడ్యుకేషనల్ హబ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కార్యాలయము ,అటవీ వన్యప్రాణుల పార్క్ ఈ రోజు గజ్వేల్ లో ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా సందర్శించడం జరిగింది..
చాలా అద్భుతమైన మోడల్ గా గజ్వేల్ పట్టణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్చిద్దారని అన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో సృజనాత్మకతో నిర్మించిన మార్కెట్ దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు.గజ్వేల్ నియోజకవర్గము అన్ని రంగాల్లో ముందు ఉందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశం లోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల వసతులతో సువిశాలమైన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించి ఇచ్చారని గజ్వేల్ ప్రజలు అదృష్టవంతులని కొనియాడారు. ఇక్కడ మార్కెట్ నిర్వహణ చాలా బాగుందని అన్నారు.
ఇ సందర్భంగా మార్కెట్ సందర్శనకు వచ్చిన వారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ స్వాగతం పలికి వారిని మార్కుట్ విశిష్టతని వారికి తెలియచేశారు. రాష్ట్రంలో ఒక మోడల్ గా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్చిదిద్దరని వారికి తెలిపారు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ రూపురేఖలు మరిపోయాయని గజ్వేల్ ప్రజలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఋణపడి ఉంటాయని తెలిపారు.
వారి వెంట గడ అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ nc రాజమౌళి, వైస్ ఛైర్మన్ జఖి, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, బాలమణి, బొగ్గుల చందు, రజిత,మార్కేట్ సెక్రెటరీ జాన్ వెస్లీ,సుపర్వైజర్ మహిపాల్, మరియు నిజామాబాద్ అధికారుల బృందం మార్కెట్ సిబ్బంది ఉన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7