ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు3, రైతు రుణమాఫీ చేసిన రైతుబాంధవుడు రైతులందరి కళ్ళల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకుంటామని బిఆర్ఎస్ నాయకులు అన్నారు.గురువారం మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద మండల బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించిన సందర్బంగా సీఎం చిత్ర పటానికి రైతులందరితో కలిసి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ నేటినుంచి నేలనర వ్యవధిలో లక్ష లోపు ఉన్న రుణమాఫీని 2018 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు నిలబెట్టుకున్నారన్నారు, కరోనా కారణంగా రైతు రుణమాఫీ ఆలస్యమైందని తెలిపిన కేసీఆర్, ఆలస్యం జరిగిన రుణమాఫీ చేసినందుకు రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు, చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న రైతులకు కెసిఆర్ రుణమాఫీ ప్రకటించడంతో రైతులందరూ సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకుంటున్నారని తెలిపారు, ఇంతకుముందు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు,ఇప్పుడు రైతు రుణమాఫీతో తెలంగాణ రైతాంగం సంతోషించే విషయమని మరో సారి కెసిఆర్ ముఖ్యమంత్రిగా గెలిపెంచుకుంటామని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో రైతులందరూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు,ఎద్దండి నరసింహారెడ్డి,కొండ శ్రీనివాస్ గౌడ్, శీలంస్వామి, బద్దిపడిగె నందురెడ్డి, నందు రావు, కోడె శ్రీనివాస్, మహిళ నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
