ప్రాంతీయం

జిల్లాలో 20 మంది కారుణ్య నియామకాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

31 Views

జిల్లాలో 20 మంది కారుణ్య నియామకాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా, జనవరి 9, 2026:
జిల్లాలో 20 మంది యువతను కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలలో నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తూ ఆకస్మాత్తుగా మరణించిన వారి కుటుంబ పోషణ నిమిత్తం ఆయా కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని, ఈ క్రమంలో 20 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *