ప్రాంతీయం

ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వం

238 Views

దౌల్తాబాద్;
సాటి మనిషి ఆపదలో ఉంటే చలించి ఆదుకోని ఆ కుటుంబానికి గుండె ధైర్యాన్ని కల్పించడమే నిజమైన మానవత్వమని, అప్పుడే మనుషులుగా కీర్తించబడతామని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన దాసరి దుబ్బవ్వ కుటుంబాన్ని గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం చేసే మంచి పనులే సమాజంలో విలువను, గుర్తింపును తీసుకువస్తాయని సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకొని వారికి గుప్పెడు గుండె ధైర్యాన్ని కలిగిస్తే మనిషిగా కోలుకుంటారని, అలా చేసే సేవా కార్యక్రమాలు మనిషికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దాసరి సాయిలు భార్య దాసరి దుబ్బవ్వ గుండెపోటుతో ఆకస్మితంగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 4 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. దుబ్బవ్వ ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచివేస్తుందని, ఆమె మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నమన్నారు. వీరిది నిరుపేద కుటుంబం ఎలాంటి భూములు ఆస్తులు లేవని కేవలం రెక్కల కష్టం మీద ఆధారపడి మాత్రమే జీవిస్తుంటారు. అలాంటి కుటుంబంలో వ్యక్తి మృతి చెందడం విషాదకరమన్నారు. మానవత్వంతో ఇంకా ఎవరైనా సహృదయులు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి తోచిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దాసరి బాలకృష్ణ, సంభాగ స్వామి, దాసరి చింటు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *