దౌల్తాబాద్: తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడిగా అక్కం శేఖర్ ను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గాడి రాజు, శిల్ప, ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, సహాయ కార్యదర్శులుగా మనోహర్, దివ్య, కమిటీ ప్రచార కార్యదర్శిగా నగేష్, కోశాధికారిగా చంద్రమౌళి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష అభియాన్ లో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మా సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేసి టైం స్కేల్, హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు…




