మంచిర్యాల జిల్లా.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్.
యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ పిలుపునిచ్చారు.
రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేర కు మంచిర్యాల జూన్ మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో మంచిర్యాల పోలీస్ ఆధ్వర్యంలో ఓ యువత – నేరాలు చేయవద్దు… భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన యువతకు అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ మరియు మంచిర్యాల ఏసిపి ముఖ్య అతిథులుగా హాజరై యువతకు గంజాయి మత్తుపదార్థాలకు బానిసలై జీవితం నాశనం చేసుకోవద్దని అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ… గంజాయికి, నేరాలకి, ట్రాఫిక్ ఉల్లంఘనలకి, సైబర్ దుర్వినియోగం కి, ర్యాగింగ్ కి, అపరిపక్వ ఉద్వేగం కు ఆత్మహత్యలకు NO చెప్పేద్దాం అని మంచి అలవాట్లు నడవడికతో భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలని యువతకు డిసిపి సూచించారు.గంజాయి, తదితర మత్తు పదార్ధాల నివారణపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాల న్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయికి బానిసలుగా మారి యువత తన భవిష్యత్‌ను నాశనం చేసుకుంటోందని, దానివల్ల వారి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారం ఇవ్వాలన్నారు. మాదకద్రవ్యాలను నిరోధించడానికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని, వీటి రవాణాలో ఎంతటి వారున్నా ఉపేక్షించమన్నారు. ప్రధానంగా యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా సరైన నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్లాలన్నారు. చిన్న పొరపాటు వల్ల జీవితకాలం నాశనమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్ మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ఐ కు పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
