తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ రైతులకు అండగా నిలిచారని బీఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు అన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులందరికి రుణమాఫీ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతాంగం రుణపడి ఉంటుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో రైతుల కోసం రైతును రాజు ను చేయాలనే లక్ష్యంతో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తించి రైతు రుణమాఫీ ప్రకటించారన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
