సిద్దిపేట జిల్లా అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామం లో శ్రీ దుర్గ యూత్ మరియు గ్రామ పెద్ద ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అన్న దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు లతో ఇక్కడ రావడం జరిగిందనీ అన్నారు. ఆ తల్లి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనక లక్ష్మీ చంద్రం, ఉపసర్పంచ్ తిగుల్ల బాలకిషన్, కొండ పోచమ్మ డైరెక్టర్ కుమ్మరి కనకయ్య, మండల కో ఆప్షన్ ఏక్ బాల్,శ్రీ దుర్గా యూత్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
