గజ్వేల్ :అక్టోబర్ 31
జగదేవపూర్: నిన్న ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్యంగా ఉండాలని త్వరగా కోలుకోవాలని కోరుతూ…మండల పరిధిలోని జంగంరెడ్డి పల్లి గ్రామం లో ఉన్న రాముని బండ, సీత రాముల ఆలయంలో మండల బిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, పిఏ సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, కో ఆప్షన్ ఎక్బల్,ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్ గుప్తా,కుమార్, యాదవ రెడ్డి, ఉప సర్పంచ్ నర్సింలు, స్థానిక అధ్యక్షులు నాచారం దేవాలయం డైరెక్టర్ నాగరాజు,మాజీ సర్పంచ్ కర్ణాకర్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





