గిరిజనుల ఆరాధ్య దైవం అమరజీవి కొమురం భీం 84వ వర్ధంతి వేడుకలు
కొమురం భీం జిల్లా
ఆసిఫాబాద్ నియోజకవర్గం కెరమెరి మండల జోడేఘాట్ గ్రామంలో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
అనంతరం ఏర్పాటు చేసిన కొమురం భీం 84వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీమతి శ్రీ సీతక్క, ఎంపీలు ,ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ ,జిల్లా అధికారులు, జిల్లా నాయకులు, గిరిజన నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
