గజ్వేల్ పట్టణంలో బుధవారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర గజ్వేల్ మండల ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.కుర్ర సత్యనారాయణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు గజ్వేల్ మండల ఎరుకల సంఘం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దానికి సహకరించిన మంత్రి హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎరుకల సంఘం ని గుర్తించినందుకు చాలా సంతోషకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం అని గత ప్రభుత్వాలు ఏవి కూడా మా కులాలను పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వానికి గజ్వేల్ మండల ఎరుకల సంఘం రుణపడి ఉంటుందని తెలిపారు కుర్ర సత్యనారాయణకి గజ్వేల్ మండల ఎరుకల సంఘం నుండి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కూరాకుల సాయి,గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 7వార్డ్ కౌన్సిలర్ కురాకులాశ్రీను,సోషల్ మీడియా ప్రెసిడెంట్ శివ,గజ్వేల్ మండల ఎస్టి సెల్అధ్యక్షులు గాలయ్య,ప్రధాన కార్యదర్శి మల్లేష్,కుతడి రాజు,మధు,నర్సింహులు, వెంకట్, వాల్మీకి, సాధా, వెంకట్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
