ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సధనంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. సత్సంగ సధనం అద్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యం లో శ్రీ మార్కండేయ ఆలయ పూజారి ఉమాశంకర్ చేతుల మీదుగా సత్సంగ సధనం వ్యవస్థాపక అద్యక్షులు శ్రీ రాముని పరమ భక్తులు ఆద్యాత్మిక గురువు శ్రీ సరస్వతీ గోవిందా రాజుల విగ్రహానికి గురుపౌర్ణమీ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సరస్వతీమంత్ర సహిత , ఉపనిషత్ అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు , అనంతరం భక్త బృందం సూర్య నమస్కారాలు , విష్ణు సహాస్రానామాలు చదివారు , హారేరామ భజనలు చేశారు.
అనంతరం తీర్థప్రసాదాలు , అన్నప్రసాదాన్ని స్వీకరించారు, ఈ కార్యక్రమంలో సత్సంగ సధనం భక్త బృందం సభ్యులు లక్ష్మీ మమ్మ , గుండం రాజిరెడ్డి ,బండారి బాల్ రెడ్డి , మెగి నర్సయ్య , అనంతరెడ్డి , గోషిక దేవదాస్ , గంట దాస్ గౌడ్ , సంజీవరెడ్డి ,నాగి రెడ్డి , మహిళా భక్త బృందం తదితరులు పాల్గొన్నారు
