ముస్తాబాద్,ఆగస్టు1 చీకోడు గ్రామంలో నిరుపేద కుటుంబమైన లబ్ధిదారులు (1). కరేడ్ల లత 50.వేలు (2). పోగుల దుర్గయ్య 19వేలు (3). ఊరడి ప్రదీప్ 14.5 వేలు (4).చిన్నరాజిరెడ్డి15.వేల రూపాయల చెక్కులను బనుక నాగరాజు యాదవ్ గామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తూ అనారోగ్యానికి గురైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ పడిగే ఆంజనేయులు సవిత , గున్నాల నాగరాజ్ గౌడ్ ఉప సర్పంచ్, కొప్పులక్ష్మణ్ డాక్టర్, కరెడ్ల యాదగిరిరెడ్డి డాక్టర్, పోగుల వెంకట్ రెడ్డి , హోన్నజీపేట కృష్ణస్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




